భోజనంలో నాణ్యత తప్పనిసరి
అనంతగిరి: పాఠశాలల్లో నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ ఉపాధ్యాయులకు సూచించారు. ఈమేరకు బుధవారం ఆయన వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గోధుమగూడ ప్రాఽథమికోన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగది, డైనింగ్ హాల్‌ను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వంట చేసేటప్పుడు, భోజనం వడ్డించే క్రమంలో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వంటగదిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.
ఎంపీడీఓ ఆధ్వర్యంలో
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని జిల్లా, మండల అధికారులు ఏకకాలంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మండల పరిధిలోని ఎర్రవల్లి స్కూల్‌ను ఎంపీడీఓ వినయ్‌కుమార్, నారాయణపూర్‌లో ఎంపీఓ దయానంద్‌లు పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
అదనపు కలెక్టర్ సుధీర్
Comments
Please login to add a commentAdd a comment