‘మార్ఫింగ్’ బ్లాక్‌మెయిల్!
ఇబ్రహీంపట్నం: వరుసకు సోదరులైన వారే.. ఓ వివాహిత ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పెడుతామని బ్లాక్‌మెయిల్‌కు యత్నించా రు. విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పడంతో బంధువులతో కలిసి చితకబాదారు. ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ చందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత (21) సమీప బంధువైన (వరుసకు సోదరుడు) సురేష్‌తో కలిసి దిగిన ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పెడతామని తొర్రూర్ గ్రామానికి చెందిన సాయి, విజయ్ (వీరు కూడా వరుసకు సోదరులే) బ్లాక్ మెయిల్ చేశారు. విషయాన్ని బాధితురాలు తన భర్త రాఘవేందర్‌కు తెలియజేసింది. దీంతో సురేష్, సాయి, విజయ్‌కు ఫోన్ చేసిన రాఘవేందర్ మాట్లాడుకుందాం రమ్మంటూ నాగన్‌పల్లి సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి పిలించాడు. అప్పటికే అక్కడ ఉన్న రాఘవేందర్ బంధువులు ఎన్.రాములు, కుమరయ్య, యాదమ్మ, విజయ్, సాయి, భరత్‌పై దాడికి పాల్పడ్డారు. కర్రలు, వైర్లతో ఇష్టానుసారం కొట్టారు. ఈ మేరకు ఫిర్యాదు రావడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
● ముగ్గురు యువకులను చితకబాదిన బాధితురాలి భర్త, బంధువులు
● ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment