రంగారెడ్డి జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి
శంకర్‌పల్లి: ఇందిరమ్మ యాప్‌లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. శంకర్‌పల్లి పట్టణం, మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. మండల పరిషత్ కార్యాలయంలో, మండలంలోని మోకిల పంచాయతీలో రికార్డులు తనిఖీ చేశారు. తర్వాత పల్లె ప్రకృతివనం, నర్సరీ, క్రీడా ప్రాంగణాన్ని సందర్శించారు. మోకిల తండాలో ఇందిరమ్మ యాప్‌లో లబ్ధిదారుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో తమకు కేటాయించిన పనిని పక్కాగా చేయాలని అధికారులకు సూచించారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ఉన్నతాధికారులను సంప్రదించాలన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ గిరిరాజు, సూపరింటెండెంట్ గోపాలకృష్ణ, ఏపీఓ నాగభూషణం, మోకిల సెక్రెటరీ ఎల్లయ్య, మోకిల తండా సెక్రెటరీ శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment