సర్వే పకడ్బందీగా చేపట్టాలి
ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలించిన కలెక్టర్ నారాయణరెడ్డి
కొత్తూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని పెంజర్ల గ్రామంలో అధికారులు చేపడుతున్న సర్వేను కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అర్హుల ఎంపికలో అనుసరించాల్సిన విధి విధానాలను అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు వివరించారు. అనంతరం గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థులకు సలహాలు ఇచ్చారు. ఇష్టపడి చదువుతేనే ఉన్నతంగా రాణిస్తారని చెప్పారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. అంగన్‌వాడీ కేంద్రం, ఆరోగ్య సబ్‌సెంటర్‌ను సందర్శించి చిన్నారులతో మాట్లాడారు. పెంజర్లలోని సబ్‌సెంటర్ పరిధిలో రికార్డులను పరిశీలించిన ఆయన ఎక్కువ అబార్షన్ కేసులు నమోదైనట్లు గుర్తించారు. వివరాలను సమర్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఎంపీడీఓ అరుంధతి, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎంపీఓ విజయలక్ష్మి, పలు శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment