మేమున్నామని..
● తోటి ఉద్యోగుల దాతృత్వం
● ఎకై ్సజ్ కానిస్టేబుల్ వైద్యానికి రూ.8 లక్షలు సాయం
● ఒకరోజు వేతనం అందజేత
అనంతగిరి: ఎకై ్సజ్ శాఖలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌కు యాక్సిడెంట్ కావడంతో రూ.8.02 లక్షలు ఇచ్చి తమ మానవత్వాన్ని చాటుకున్నారు ఉమ్మడి రంగారెడ్డి డివిజన్ ఆ శాఖ అధికారులు, సిబ్బంది. వికారాబాద్ ఎకై ్సజ్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న సురేందర్.. గత నెలలో వికారాబాద్ పట్టణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. మొకీలు చిప్ప మార్పిడి అనివార్యం అయింది. ఇందుకు వైద్య ఖర్చులకు రూ.లక్షలు వెచ్చించాల్సి ఉంది. కానిస్టేబుల్‌ది నిరుపేద కుటుంబం కావడంతో.. శాఖ అధికారులు, సిబ్బంది మేమున్నామంటూ ముందుకు వచ్చారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఒకరోజు వేతనం చెక్కును గురువారం నగరంలోని ఆబ్కారీ భవన్‌లో కమిషనర్ చేవూరి హరికిరణ్, రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్ చేతుల మీదుగా సురేందర్ తల్లిదండ్రులకు అందజేశారు. వికారాబాద్, శంషాబాద్, మల్కాజ్‌గిరి, సరూర్‌నగర్ డీపీఈఓలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. కష్టాల్లో ఉన్న తోటి ఉద్యోగికి మేమున్నామంటూ అండగా నిలిచినవారికి ఎకై ్సజ్ సీఐ రాఘవీణ, ఎస్‌ఐలు శ్రీనివాస్, వీరాంజనేయులు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment