బైపాస్ పనులు పూర్తి చేస్తాం
తాండూరు రూరల్: అసంపూర్తిగా ఉన్న బైపాస్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేస్తామని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. గురువారం మండల పరిధి చెంగోల్ గ్రామ శివారులో బైపాస్ సర్వే పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన 17 మంది చెంగోల్, అంతారంతండా రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే రికార్డుల్లో ఒకరి పొజిషన్‌లో మరొకరు ఉండటం వలన పరిహారం ఆలస్యమయిందని తెలిపారు. రైతులందరూ కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారు. అందరూ ఒకే మాటమీద ఉంటే.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం త్వరగా అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. తహసీల్దార్ తారాసింగ్, సర్వేయర్ మహేశ్, ఆర్‌ఐ గోపి, జూనియర్ అసిస్టెంట్ బాబు, నాయకులు రాముయాదవ్, సంపత్, కృష్ణయ్య, హన్మంత్, నాగేశం, రాజు ఉన్నారు.
ఆందోళన వద్దు
బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు ఆందోళన చెందవద్దని మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయన విడిగా.. చెంగోల్లో రోడ్డు సర్వేను రైతులతో కలిసి పరిశీలించారు.
రైతులకు పరిహారం చెల్లిస్తాం
సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
చెంగోల్‌లో సర్వేపనుల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment