దుద్యాలలో తాత్కాలిక పోలీస్ స్టేషన్
దుద్యాల్: లగచర్ల ఘటన నేపథ్యంలో దుద్యాల మండల కేంద్రంలో తాత్కాలిక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు గురువారం పల్లె దవాఖానను కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ కిషన్, పంచాయత్‌రాజ్ ఏఈ సురేందర్‌రెడ్డి రెడ్డి, ఎస్‌ఐ రహూఫ్‌లు పరిశీలించారు. అనంతరం కడా అధికారి మాట్లాడారు. దుద్యాల మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అందుకు అవసరమైన నిధులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంజూరు చేయనున్నారని వెల్లడించారు. అందులో భాగంగానే తొలుత తాత్కాలికంగా ఆస్పత్రిలో ఠాణా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఠాణాతో పాటు.. హకీంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనాలు నిర్మించేందుకు స్థల పరిశీలన చేశామని చెప్పారు. ఇదిలా ఉండగా.. హకీంపేట్‌లో ఇది వరకే జూనియర్ కళాశాల మంజూరు అయిన విషయం తెలిసిందే. ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనాల్లోనే జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో ఎంఈఓ విజయరామారావ్, ఉప తహసీల్దార్ వీరేశ్‌బాబు, రెవెన్యూ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హకీంపేట్ జెడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల
కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment