మెనూ ప్రకారం భోజనం అందించాలి
అనంతగిరి: మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ వార్డెన్లను ఆదేశించారు. గురువారం ఆయన వికారాబాద్ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహం నంబర్ 1, 2లతో పాటు వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. పరిసరాలను పర్యవేక్షించారు. మెనూ, వంట గది, బియ్యం తదితర సామగ్రిని పరిశీలించారు. ప్రతి రోజు టిఫిన్, భోజనం ఎలా పెడుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. బాత్ రూంలు, మరుగుదొడ్లతో పాటు వసతిగృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఫ్యాన్లు, లైట్లు, మేజర్, మైనర్ రిపేర్ పనులు ఎంత వరకు పూర్తి చేశారని నిర్వాహకులను ప్రశ్నించారు. పనులు పూర్తయిన అనంతరం మరమ్మతుకు ముందు తర్వాత ఫొటోలు తీసి పంపించాలని ఆదేశించారు. బాగా చదువుకొని పదిలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. షెడ్యూల్డ్ కులాల జిల్లా అభివృద్ధి అధికారి మల్లేశం, వార్డెన్లు రత్నం, రవీందర్, సుక్రవర్ధన్ రెడ్డి ఉన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
కలెక్టర్ ప్రతీక్ జైన్ వసతిగృహాల తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment