పార్కింగ్‌ స్థలాన్ని కాపాడండి | - | Sakshi
Sakshi News home page

పార్కింగ్‌ స్థలాన్ని కాపాడండి

Published Sat, Dec 21 2024 7:32 AM | Last Updated on Sat, Dec 21 2024 7:32 AM

-

మీర్‌పేట: కబ్జాకు గురైన పార్కింగ్‌ స్థలాలను తిరిగి ప్రజలకు ఇప్పించాలని మీర్‌పేట కార్పొరేషన్‌ 31వ డివిజన్‌ కార్పొరేటర్‌ విజయలక్ష్మి శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డికు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనప్రియా మహానగర్‌లోని 5, 9ఏ బ్లాకులలోని పార్కింగ్‌ స్థలాన్ని కొందరు కబ్జా చేసి షెటర్లు నిర్మించారని ఆరోపించారు. ఒక్కో షెటర్‌ను రూ.10 లక్షలకు విక్రయిస్తున్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇప్పటివరకు 8 షెటర్లను అమ్ముకోగా, మరో పది షెటర్లు అమ్మకానికి పెట్టారని వివరించారు. ఈ మేరకు పార్కింగ్‌ స్థలాన్ని కాపాడాలని కలెక్టర్‌ను కోరినట్లు చెప్పారు. కలెక్టర్‌ స్పందిస్తూ.. ఆక్రమణ దారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement