‘మహా’ ధ్యానం.. అంతా సిద్ధం
కడ్తాల్: మహేశ్వర మహాపిరమిడ్ (పత్రీజీ శక్తి స్థల్)లో శనివారం నుంచి నిర్వహించే ధ్యాన మహాయాగ వేడుకలకు పిరమిడ్ ప్రాంగణం ముస్తాబైంది. ఈనెల 31 వరకు 11 రోజుల పాటు కొనసాగే కార్యక్రమాలకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం నుంచే వేలాదిగా ధ్యానులు తరలిరావడం కనిపించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఉత్సవాలకు ప్రముఖ ఆధ్యాత్మిక, ధ్యాన గురువులు, కళాకారులు హాజరుకానున్నట్టు ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ధ్యానులకు ఇబ్బంది కలుగకుండా సౌకర్యాలు కల్పించినట్టు చెప్పారు.
ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ
ధ్యాన వేడుకల సందర్భంగా మహేశ్వర మహాపిరమిడ్‌ను శుక్రవారం సాయంత్రం శంషాబాద్ జోన్ డీసీపీ రాజేశ్, సీఐ శివప్రసాద్, ఎస్‌ఐ వరప్రసాద్ పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఏర్పాట్ల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు.
నేటి నుంచి పత్రీజీ ధ్యాన మహాయాగం
తరలివస్తున్న ధ్యానులు
Comments
Please login to add a commentAdd a comment