ఎస్‌ఎస్‌ఏలను రెగ్యులరైజ్ చేయాలి
అనంతగిరి: తమ సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో భాగంగా శుక్రవారం బోనాలు ఎత్తి నిరసన తెలిపారు. ఎస్‌ఎస్‌ఏలోని అన్ని విభాగాలకు చెందిన మహిళ ఉద్యోగులు బోనమెత్తి వికారాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్ల మీదుగా ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే తమను రెగ్యులరైజ్ చేయాలని నినదించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కేతావత్ గంగ్యా నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి వెంటనే తమను చర్చలకు పిలిచి న్యాయం చేయాలన్నారు. 21 ఏళ్లుగా విద్యాశాఖలో కీలకంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం, ప్రభావతి, రవికుమార్, ఆశాలతా, స్వరూప, శైలజ, రాధిక, పల్లవి, దేవి, రాజేశ్వరీ, స్రవంతి, సుమిత్ర, చైతన్య, రఘుసింగ్, సర్వర్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం కళ్లు తెరవాలి:డాక్టర్ రాజశేఖర్
21 సంవత్సరాలుగా విద్యాశాఖలో చాలి చాలని వేతనాలతో పనిచేస్తున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని బీజేపీ జిల్లా ఆధ్యాత్మిక సెల్ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేయాలన్నారు. లేదంటే ఎస్‌ఎస్‌ఏల ఉద్యమంలో తాము సైతం ముందుండి పోరాటుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాఘవేందర్, సుధాకర్, రాములు తదితరులు పాల్గొన్నారు.
సంఘం జిల్లా అధ్యక్షుడు గంగ్యా నాయక్
బోనమెత్తి నిరసన తెలిపిన ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment