టార్గెట్ చేరుకోవాలి
ఉపాధ్యాయ దినోత్సవం శుక్రవారం పలుగుతండా పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
8లోu
9లోu
అనంతగిరి: స్త్రీనిధి రుణాల పంపిణీ, బ్యాంక్ లింకేజీ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. శుక్రవారం ఆయన కాన్ఫరెన్స్ హాల్‌లో గ్రామీణ అభివృద్ధి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అర్హత ఉన్న మహిళా సంఘాలకు టార్గెట్ ప్రకారం రుణాలు అందించి.. వంద శాతం రికవరీ సైతం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 60 ఏళ్లులోపు మహిళలు రుణాలు తీసుకుని చనిపోతే సంబంధిత ప్రతాలు మండల సమాఖ్యలో అందజేసి లబ్ధిపొందాలన్నారు. ప్రతీ వారం గ్రామీణ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షిస్తూ రికవరీలపై శ్రద్ధ చూపాలన్నారు. లోన్ తీసుకునే సమయంలో సమస్యలు వస్తే సంబంధిత అధికారి దృష్టికి తీసుకురావాలన్నారు. క్లెయిమ్‌లకు సంబంధించిన రిపోర్టులు ఎప్పటికప్పుడు అందజేయాలని ఆదేశించారు. టూవీలర్ మొబైల్ క్యాంటీన్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, అదనపు పీడీ సరోజ, స్త్రీనిధి ఆర్‌ఎం ఉదయకుమారి, డీపీఎంలు, ఏపీఎంలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment