పరిగి: విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని పట్టణ కేంద్రంలోని తుంకుల్‌గడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ థామాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గురుకులంలో వాయిస్ ఫర్ గర్‌ల్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు కార్యాచరణ ఆధారిత విద్యా శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ జీవితంలో సమస్యలను సమన్వయంతో ఎదుర్కోవాలని సూచించారు. విద్యార్థుల్లో మనోస్థైర్యాన్ని నింపడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. లక్ష్యసాధన కోసం ప్రతిఒక్కరూ ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, స్వచ్ఛందసంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఆరుగురికి జరిమానా
తాండూర్‌టౌన్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అసిస్టెంట్ కలెక్టర్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఉమా హారతి శుక్రవారం ఆరుగురికి జరిమానా విధించినట్లు పట్టణ ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపారు. ఆరుగురిలో ఐదు మందికి వెయ్యి రూపాయాల జరిమానా విధించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment