టైలరింగ్ శిక్షణ ప్రారంభం
దుద్యాల్: మండలంలోని హకీంపేట్ గ్రామంలో ప్రథమ్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ కో ఆర్డినేటర్ కవిత మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి ద్వారా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పదో తరగతి పాసైన మహిళలు, యువతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ ప్రత్యేక అధికారి శ్రీనివాస్, గ్రామస్తుడు శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment