ధారూరు: బహిర్భూమికి వెళ్లి వస్తున్న ఓ వృద్ధుడిని కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపర్చాయి. ఈ సంఘటన మండల పరిధిలోని కొండాపూర్‌కలాన్‌లో చోటుచేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కేశపల్లి నర్సింహులు(70) సాయంత్రం బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా కుక్క వెంబడించి దాడి చేసింది. గాయపడిన అతన్ని కుటుంబ సభ్యులు వికారాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మరోఘటనలో కుక్కింద గ్రామానికి చెందిన కానపురం మల్లయ్య(50) పశువులకు నీరు తాగించి ఇంటికి వస్తుండగా కుక్క దాడి చేసింది. వెంటనే అతడిని స్థానికంగా చికిత్స చేయించారు. శునకాల స్వైర విహారంపై స్థానికులు భయాందోఽళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment