వెంటనే చర్యలు తీసుకోవాలి
అనంతగిరి: అసెంబ్లీలో సభాపతిని అవమాన పర్చేలా పేపర్లు చించి విసిరేసిన బీఆర్‌ఎస్ ఎ మ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కా ంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లేశం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సామరస్యంగా సమావేఽశాలు జరుగుతున్న తరుణంలో కావాలనే సభలో గందరగోళం సృస్టించేలా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ వాళ్లు పదేళ్లు అధికారంలో ఉండి ఏమి చేయలేకపోయారని విమర్శించారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆరు జట్లు
కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. 14 బాలికల, 18 బాలుర జట్లు కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాయి. సాయంత్రం వరకు నిర్వహించిన ఈ పోటీల్లో బాలుర విభాగంలో తొలి మూడు స్థానాల్లో వరుసగా కొడంగల్, మర్పల్లి, పరిగి నిలవగా బాలికల విభాగంలో తాండూరు, బొంరాస్‌పేట, కుల్కచర్ల జట్లు గెలుపొందాయని పీడీలు అనిల్‌కుమార్, అజీజ్ తెలిపారు. రాష్ట్ర స్థాయి సీఎం కప్ టోర్నమెంట్‌కు ఆరు జట్లు ఎంపికయ్యాయని తెలిపారు.
బాలిక అపహరణపై పోక్సో కేసు
యువకుడికి రిమాండ్
కుల్కచర్ల: బాలికను అపహరించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన కుల్కచర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ అన్వేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన బాలిక(17)ను గత నెల మొదటివారంలో దోమ మండలం గొడుగోనిపల్లి గ్రామానికి చెందిన నరేష్ అపహరించుకుని వెళ్లాడు. ఈమేరకు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారించి అపహరించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలుసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని శుక్రవారం పరిగి సబ్ జైలుకు తరలించారని ఎస్‌ఐ తెలిపారు.
కట్నం కోసం వేధించిన భర్తపై కేసు
తాండూరు టౌన్: అదనపు కట్నం కోసం వేధించిన భర్తపై ఓ భార్య ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. పట్టణ ఎస్‌ఐ భరత్‌రెడ్డి కథనం ప్రకారం.. సాయిపూర్‌కు చెందిన సారియా సుల్తానా, ఖలీల్ ఖురేషి భార్యాభర్తలు. వీరికి రెండేళ్ల క్రితం వివాహామైంది. 9 నెలల బాబు కూడా ఉన్నారు. అయితే ఖలీల్ తనను కొన్ని నెలల నుంచి అదనపు కట్నం కోసం వేధించి, చిత్రహింసలకు గురి చేశారని సుల్తానా ఆరోపించారు. అంతేకాకుండా అత్త సుల్తానా బేగం, ఆడపడుచు సల్మాలను కూడా తనని వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఖలీల్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment