సర్వేను అడ్డుకున్న రైతులు
కొడంగల్: మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామంలో సర్వేకు వెళ్లిన సిబ్బందిని అప్పాయిపల్లి రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇచ్చిన తరువాతే భూములు స్వాధీనం చేసుకోవాలని అధికారులకు రైతులు సూచించారు. అప్పాయిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 19లో ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం ప్రభుత్వం అసైన్‌మెంట్ భూమిని సేకరించింది. రైతుల దగ్గర భూములు తీసుకొని ఎకరాకు రూ.10లక్షలు, ఒక ప్లాట్, ఒక ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారని, ఇప్పటి వరకూ పరిహారం అందలేదని రైతులు ఆరోపించారు. పూర్తిగా పరిహారం చెల్లించిన అనంతరం ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఫకీరప్ప, మోతీబాయి, రాములు గౌడ్, వెంకటమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment