చేవెళ్ల: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని తంగడపల్లి అనుబంధ గ్రామమైన మడికట్టకు చెందిన హన్మంత్‌రెడ్డి, పోచ య్య(55)లు బుధవారం బైక్‌పై ఎన్కేపల్లి దగ్గర పెళ్లికి హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. మార్గమధ్యలో శంకర్‌పల్లి మండలంలోని హుసెన్‌పూర్ చౌరస్తాలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన ఇరువురిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అందులో తీవ్రంగా గాయపడిన పోచయ్య గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు శుక్రవారం చేవెళ్లలో పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కారుతో ఢీకొట్టిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ వారితో మాట్లాడి ఈ ప్రమాదానికి సంబంధించి ఘటన జరిగిన రోజునే కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కారుతో ఢీకొట్టిన పోలీస్ అధికారి భాస్కర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతి చెందిన పోచయ్య కుటుంబానికి చేవెళ్ల మాజీ ఎంపీపీ ఎం.బాల్‌రాజ్ రూ.25 వేల నగదు అందించారు. మృతుడు వ్యవసాయ కూలీగా జీవనం సాగించేవాడు. కార్యక్రమంలో గ్రామ నాయకులు రాజు, సత్తయ్య తదితరులు ఉన్నారు.
బైక్– కారు ఢీకొన్న ఘటనలో
Comments
Please login to add a commentAdd a comment