సేవలు వినియోగించుకోండి
పరిగి: ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఎన్నో రకాల సేవలను అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పరిగి డీఎం కరుణశ్రీ సూచించారు. శుక్రవారం మర్యాదపూర్వక దినోత్సవం సందర్భంగా డీఎం, సిబ్బంది స్థానిక బస్టాండ్‌లో ప్రయాణికులకు పుష్పం ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రయాణికులతోనే ఆర్టీసీ నడుస్తుందని అందుకు మర్యాదలు చేయడం తమ విధి అన్నారు. ప్రజలు కూడా తమ ప్రయాణాన్ని ఆర్టీసీలోనే చేయాలని సూచించారు. ప్రైవేటు ప్రయాణాలకు స్వస్తి పలికి ఆర్టీసీ ప్రయాణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పరిగి ఆర్టీసీ డీఎం కరుణశ్రీ
Comments
Please login to add a commentAdd a comment