మిగిలింది 32 రోజులే..!
● జనవరి 26తో ముగియనున్నకౌన్సిల్ పదవీ కాలం ● జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు..97 మంది కౌన్సిలర్లు
తాండూరు: చైర్మన్ సాబ్ మా వార్డులో సమస్యలను పరిష్కరించండి.. కౌన్సిల్ సాబ్ మా వీధిలో విద్యు త్ దీపాలు వెలగడం లేదు. వేయించండి.. అంటూ ఉదయం లేచింది మొదలు వార్డు ప్రజలు మున్సిపల్ చైర్‌పర్సన్,కౌన్సిలర్లకు విన్నపాలు వినిపిస్తారు. అయితే ఈ విన్నపాలు వినే అవకాశం వారికి మరో 32 రోజులు మాత్రమే ఉంది. పాలకవర్గం గడువు వచ్చే ఏడాది జనవరి 26తో ముగియనుంది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులు సామాన్య ప్రజలుగా మారనున్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా 97 మంది కౌన్సిలర్లు ఉన్నారు. తాండూరు మున్సిపాలిటీలో మాత్రం అనుకున్నంత మేర అభివృద్ధి చేయలేకపోయామనే ఆందోళన కౌన్సిలర్లలో వ్యక్తమవుతోంది.
నామమాత్రంగా అభివృద్ధి
తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు 2020 జనవరి నెలలో ఎన్నికలు జరిగాయి. కోవిడ్ నేపథ్యంలో ఏడాది పాటు పాలన కుంటుపడింది. ఐదేళ్లపాటు పదవిలో కొనసాగిన కౌన్సిలర్లు వారివారి వార్డుల్లో పెద్దగా అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు లేవు. ఒకరిద్దరు మినహా మిగతా వారంతా ఆశించిన మేర పనులు చేయలేకపోయారు. ప్రధానంగా మున్సిపల్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోయారు. కమిషనర్ లేకపోవడంతో ఆర్డీఓకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో అభివృద్ధి కుంటుపడిందని చెప్పవచ్చు.
వర్గపోరుతో..
మరోవైపు అధికార పార్టీలో వర్గపోరు కారణంగా కౌన్సిల్ సమావేశాలు జరగలేదు. బీఆర్‌ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాఽధించి చైర్‌పర్సన్ సీటును దక్కించుకుంది. అప్పట్లు చైర్‌పర్సన్ పదవి కోసం బీఆర్‌ఎస్ నుంచి తాటికొండ స్వప్న, పట్లోళ్ల దీప పోటీ పడ్డారు. ఎన్నికల సమయంలో తామే చైర్‌పర్సన్ అంటూ ఇద్దరూ ప్రచారం చేశారు. అనూహ్యంగా ఇరువురూ విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికలతో బీఆర్‌ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, నాటి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి మధ్య వర్గపోరు సాగింది. పట్నం వర్గం నుంచి చైర్‌పర్సన్ రేసులో స్వప్న.. పైలెట్ వర్గం నుంచి దీప పోటీ పడ్డారు. దీంతో అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగి పట్నం వర్గానికి చెందిన తాటికొండ స్వప్నకు చైర్‌పర్సన్‌గా రెండున్నరేళ్ల పాటు కొనసాగించేందుకు అవకాశం కల్పించారు. పైలెట్ వర్గానికి చెందిన పట్లోళ్ల దీపను వైస్ చైర్‌పర్సన్‌గా నియమించారు. తదనంతర కాలంలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ల మధ్య విభేదాలు తలెత్తి తారా స్థాయికి చేరాయి. దీంతో పట్నం వర్సెస్.. పైలెట్‌గా మారింది. దీంతో మున్సిపల్ కార్యాయంలో ఏ పని చేపట్టినా రెండు వర్గాలు విభేదించడం మొదలు పెట్టాయి. మరోవైపు ఇన్‌చార్జ్ కమిషనర్‌గా ఉన్న ఆర్డీఓ వర్గపోరుకు మరింత ఆజ్యం పోశారనే ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు వర్గపోరు కొనసాగుతూ వచ్చింది. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బుయ్యని మనోహర్‌రెడ్డి విజయం సాఽధించడంతో మున్సిపల్ చైర్‌పర్సన్ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మున్సిపల్ వ్యవస్థ గాడిలో పాడింది..
ఏడాదిగా అభివృద్ధి పనులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాండూరు మున్సిపాలిటీలో వర్గపోరు ఆగిపోయింది. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి మున్సిపల్ కౌన్సిల్‌కు పూర్తిగా అధికారాలు ఇవ్వడంతో కౌన్సిలర్ స మవేశాలు ప్రశాంతంగా జరిగాయి. కౌన్సిల్‌లో అభివృద్ధి పనులకు పెట్టిన ఎజెండాలో సభ్యులు ఆమో దం పొందుతు వచ్చాయి. దీంతో రూ.కోట్లతో ము న్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment