భక్తిశ్రద్ధలతో బోనాలు
● బోనమెత్తిన జ్యోగిని శ్యామల
నవాబుపేట: మండలంలోని నారెగూడ గ్రామంలో మూడు రోజులుగా మైసమ్మ, ఈదమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాలు జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా బుధవారం జోగిని శ్యామల బోనం ఎత్తుకొని హనుమాన్ మందిరం నుంచి మైసమ్మ ఆలయం వరకు ఆటపాటలతో అలరించారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తులు పూనకాలతో గ్రామం మార్మోగింది. వేడుకల్లో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఇన్‌చార్జ్ భీమ్ భరత్, ఆలయ నిర్మాణ దాతలు రఘునందన్ రెడ్డి, చంద్రారెడ్డి, మాజీ సర్పంచులు పర్మయ్య, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment