దేశ సమైక్యతకు నిరంతర కృషి
చేవెళ్ల: దేశ సమైక్యత కోసం నిరంతరం పాటుపడుతున్న సంస్థ బజరంగ్‌దళ్ అని పాలమూరు విభాగ్ సంయోజక్ గూడెం రమేశ్ అన్నారు. బుధవారం జరిగిన విశ్వహిందూ పరిషత్ జిల్లా శిక్షణవర్గ కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్, బజరంగ్‌దళ్ జిల్లా నాయకులు చేవెళ్ల బజరంగ్‌దళ్ నూతన కమిటీని ఎంపిక చేశారు. మండల బజరంగ్‌దళ్ సంయోజక్‌గా డి.అనిల్‌కుమార్‌ముదిరాజ్, సహ సంయోజక్‌గా గణేశ్, అనిల్, గోరక్ష సంయోజక్‌గా మల్లేశ్, ధర్మప్రసార్‌గా రాఘవేంద్రచారి, విద్యార్థి సంయోజక్‌గా విశ్వేశ్వర్‌లను నియమించినట్లు ప్రకటించారు. జిల్లా ధర్మప్రసాద్ చిలుకూరి శ్రీనివాస్, బజరంగ్‌దళ్ కార్యకర్త ధనుష్‌రెడ్డి, సందీప్, నవీన్, వెంకటేశ్, శివకుమార్, వీహెచ్‌పీ ప్రాంత ఉపాధ్యక్షులు జగదీశ్వర్, అధికార ప్రతినిధి శశిదర్, భిక్షమయ్య, ప్రశాంత్, శ్రీలత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment