ఆర్గనైజర్, యాజమాన్యంపై కేసు నమోదు
మొయినాబాద్: ఎలాంటి అనుమతి లేకుండా పార్టీ నిర్వహిస్తూ ఆల్కహాల్, హుక్కా వినియోగిస్తున్న ఫాంహౌస్‌పై పోలీసులు దాడి చేశారు. పార్టీ నిర్వహిస్తున్న ఆర్గనైజర్‌తోపాటు ఫాంహౌస్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని ఎనికేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనికేపల్లిలోని సయీద్ ఫాంహౌస్‌లో శనివారం అర్ధరాత్రి సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా పార్టీ నిర్వహిస్తున్నారు. పార్టీలో ఆల్కహాల్, హుక్కా వినియోగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేసి పార్టీని భగ్నం చేశారు. మద్యం బాటిళ్లు, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. పార్టీ నిర్వహిస్తున్న ఆర్గనైజర్‌తోపాటు ఫాంహౌస్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment