సైన్స్ టీచర్లకు సదావకాశం
కేశంపేట: శాసీ్త్రయ దృక్పథాన్ని మరింతగా పెంచి విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేందుకు సైన్స్ ఉపాధ్యాయులను సమాయత్తం చేయాలనే లక్ష్యంతో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్టీ) కృషి చేస్తోంది. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కారించుకొని పాఠశాలల్లో సైన్స్ బోఽధించే ఉపాధ్యాయులతో హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయిలో సైన్స్ సెమినార్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన సైన్స్‌లో పీజీ చేసిన ఉపాధ్యాయులు, బీఈడీ, డైట్ కళాశాలల నుంచి విద్యాశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎంపిక చేసుకోవాల్సిన అంశాలు..
సైన్స్ ఉపాధ్యాయులు విద్యాశాఖ సూచించిన అంశాల్లో తమ ప్రతిభ కనబర్చాల్సి ఉంటుంది.
● మన ప్రపంచంలో సైన్స్ అనే అంశంపై లేదా సైన్స్ బోధనలో కృతిమ మేధ (ఆర్టిఫిషియల్) ప్రభావం.
● పాఠశాలల్లో సుస్థిర పర్యావరణ వ్యవస్థ, నిర్వహణ వ్యూహాలు.
● విద్యార్థుల శ్రేయస్సుకు ఆహారం విద్య, ఉపాధ్యాయుల పాత్ర.
● రసాయన శాస్త్రం నేర్చుకునేందుకు ఉన్న సాధనాలు.
● సైన్స్‌లో విద్యా ప్రమాణాలు మెరుగు కోసం ఉన్న శాసీ్త్రయ మార్గాలు.
దరఖాస్తు విధానం
సైన్స్ సెమినార్‌లో పాల్గొనేందుకు అసక్తి ఉన్న సైన్స్ ఉపాధ్యాయులు విద్యాశాఖ సూచించిన అంశాల్లో ఏదైనా ఒక అంశాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. mail:tgscertseminar@gmail.comకు పూర్తి వివరాలతో జనవరి 20వ తేదీ వరకు మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు పంపిన నివేదికలను పరిశీలించి ఉత్తమ అంశాలను సెమినార్‌కు ఎంపిక చేస్తారు. ఎంపికై న అంశాలతో ఉపాధ్యాయులు ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం రోజున వివరించాల్సి ఉంటుంది. ఇందులో ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులకు జ్ఞాపికలతోపాటు ప్రశంసాపత్రం ఇచ్చి సన్మానించనున్నారు.
రాష్ట్రస్థాయి సెమినార్‌కు దరఖాస్తుల ఆహ్వానం
జనవరి 20 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం
ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్
దినోత్సవం రోజు ప్రదర్శన
ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులకు సన్మానం
వినియోగించుకోవాలి
రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సైన్స్ సెమినార్‌ను సైన్స్ ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధ్యాయులు ప్రదర్శించే అంశాలతో రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు కలుగుతుంది. మరిన్ని వివరాలకు 93953 90985 నంబర్‌లో సంప్రదించండి.
– శ్రీనివాస్‌రావు, జిల్లా సైన్స్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment