బీసీలు అన్ని రంగాల్లో ఎదగాలి
షాబాద్: బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్‌లో బీసీ ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా నియమితులైన కావలి చంద్రశేఖర్, బీజేపీ మండల అధ్యక్షుడిగా ఎన్నికై న మద్దూరు మాణెయ్యలను ఘనంగా సన్మానించారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ.. హక్కుల సాధనకోసం బీసీలు సమష్టిగా పోరాడాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజా చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు నర్సింహులు, కుర్వ సంఘం మండల అధ్యక్షుడు పాండు, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు లింగం, మాసయ్య, గౌరవ అధ్యక్షుడు వెంకటయ్య, బీసీ ఐక్యవేదిక నాయకులు రవీందర్, స్వామి, నర్సింహులు, మహేందర్, శ్రీనివాస్‌గౌడ్, సత్తయ్య, ఆనందం, చెన్నయ్య, గౌరీశ్వర్ పాల్గొన్నారు.
42 శాతం రిజర్వేషన్ కేటాయించాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ డిమాండ్ చేశారు. మండల పరిధి మన్‌మర్రి గ్రామంలో సేన గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జెట్టని శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా ఉల్లి కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా గడ్డమీది రాజు, కార్యవర్గ సభ్యులను ఎకగ్రీవంగా ఎనుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. బీసీల లెక్క తేలడానికి దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధిచెందిన అగ్రకులాలకు ఒక రోజులో బిల్లు పెట్టి, ఆగమేఘాల మీద 10 శాతం రిజర్వేషన్లు ఆమోదించారని, వారికి రిజర్వేషన్లు పెంచడానికి మూడు రోజుల్లో లోక్‌సభ, రాజ్యసభలో సవరణ చేసి రాష్ట్రపతి సంతకం చేశారని వెల్లడించారు. కానీ 50 శాతం జనాభా ఉన్న బీద కులాలకు రాజ్యాంగ సవరణ చేయరా అని ప్రశ్నించారు. మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నా బీసీల బిల్లును కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం ఆరోపించారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
బీసీసేన జాతీయ అధ్యక్షుడు కృష్ణ
Comments
Please login to add a commentAdd a comment