ఉపాధ్యాయుల పనితీరు మారాలి
తాండూరు రూరల్: పదోతరగతి సిలబస్ పూర్తి చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని.. ఉత్తీర్ణత శాతం మెరుగుపడాలని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి ప్రధానోపాధ్యాయులకు సూచించారు. సోమవారం పెద్దేముల్ జెడ్పీహెచ్‌ఎస్(బాలుర) పాటశాలలో మండల విద్యాధికారి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పనితీరు మార్చుకుని విధులపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మధ్యాహ్నభోజన విషయంలో అజాగ్రత్త వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. టీఎల్‌ఎమ్‌లు వినియోగిస్తూ విద్యార్థులకు బోధించాలన్నారు. సమావేశంలో మండల విద్యాధికారి నర్సింగ్‌రావు ప్రధానోపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించాలి
ధారూరు: ఇంగ్లిష్ రీడింగ్ స్కిల్ డెవలప్‌మెంట్ పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని డీఈఓ రేణుకాదేవి సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్(బాలుర) పాఠశాలలో కాంప్లెక్స్ హెచ్‌ఎంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. 3,4,5 తరగతుల విద్యార్థులకు రీడింగ్ యాక్టివిటీ ద్వారా ప్రత్యేక కార్యాచరణతో ప్రతి రోజు పదినిమిషాల సమయం కేటాయించి ప్రగతిని నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంఈఓ శ్రీనివాస్, ఏఎంఓ రామ్‌గుప్తా, కాంప్లెక్స్ కార్యదర్శి ఇందిర, రిసోర్స్‌పర్సన్లు బాల్‌రాజ్, నర్సింహరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాధికారి రేణుకాదేవి
Comments
Please login to add a commentAdd a comment