పోలీసులకు ఇంటర్‌జోన్ క్రీడా పోటీలు
ప్రారంభించిన ఎస్పీ నారాయణరెడ్డి
అనంతగిరి: ఒత్తిళ్లను అధిగమిస్తూ క్రీడల్లో రాణించి స్ఫూర్తిగా నిలవాలని పోలీస్ క్రీడాకారులకు ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. సోమవారం వికారాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు నిర్వహిస్తున్న ఇంటర్ జోన్ పోలీస్ క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్‌జోన్‌లో గెలిచిన పోలీస్ క్రీడాకారులు కరీంనగర్‌లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు నిర్వహించే 3వ తెలంగాణ పోలీస్ గేమ్స్– పోలీస్ మీట్స్‌లో పాల్గొంటారని చెప్పారు. ఈ మీట్‌లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, టగ్‌ఆఫ్‌వార్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ పోటీలుంటాయని చెప్పారు. క్రీడా పోటీలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసికంగా దృఢంగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్‌పీ శ్రీనివాస్ రెడ్డి, ఏఆర్ డీఎస్‌పీ వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment