ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
పరిగి: పరిగిని ఆదర్శ మున్సిపాలిటీ తీర్చిదిద్దుతానని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు గ్రామాలకు, పట్టణాలకు అందాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాను అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ క్రిందకు తీసుకురావడంతో మరింత అభివృద్ధి జరగనుందన్నారు. పట్టణంలో ఇప్పటికే రూ.16 కోట్ల నిధులతో అన్ని వార్డుల్లో నీటి సమస్యల పరిష్కారం కోసం ట్యాంకు ల నిర్మాణం జరుగుతోందన్నారు. పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధికి పాటుపడుదామన్నారు. లక్నాపూర్ ప్రాజెక్టులో బోటింగ్ ఏర్పాటు చేసి పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుందఅశోక్‌కుమార్, వైస్ చైర్మన్ ప్రసన్న, కౌన్సిలర్లు రవీందర్, వెంకటయ్య, కృష్ణ, మునీర్, నాగేశ్వర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తాం
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో టీయూటీఎఫ్ 2025 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, మండల అధ్యక్షుడు దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment