మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి కొత్తగా రూ.60 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులు మంజూరయ్యాయని మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ అధ్యక్షత చివరి మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 11 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం చైర్‌పర్సన్ మంజుల మాట్లాడుతూ.. శాసన సభ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందన్నారు. కొత్తగా మంజూరైన నిధులకు సంబంధించి త్వరలోనే స్పీకర్ ప్రసాద్‌కుమార్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. పట్టణాభివృద్ధికి రూ.పదికోట్ల ఎస్‌డీఎఫ్ నిధులు మంజూరుకానున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ శంషద్‌బేగం, ఫ్లోర్ లీడర్ సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
చివరి సాధారణ సమావేశంలో 11 అంశాలకు ఏకగ్రీవ ఆమోదం
Comments
Please login to add a commentAdd a comment