గ్రంథాలయాల పాత్ర కీలకం
● మంత్రి జూపల్లి కృష్ణారావు
షాద్‌నగర్: సమాజంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలోని గ్రేడ్–1 గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకరోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రంథాలయాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథాలయాల్లో డిజిటలైజేషన్ చేయడం గొప్ప పరిణామమని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. సమాజంలో ఏమార్పు జరగాలన్నా గ్రంథాలయాలతో సాధ్యం అవుతుందని అన్నారు. తెలంగాణ చరిత్రను మార్చిన ఘనత గ్రంథాలయానికి ఉందన్నారు. అనంతరం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూదన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్‌గా మదన్‌మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా నక్కబాల్‌రాజ్, ప్రధాన కార్యదర్శిగా క్యూసెట్ శ్రీను తదితరులు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, నాయకులు బాబర్‌ఖాన్, రఘునాయక్, తిరుపతిరెడ్డి, విశ్వం, బాల్‌రాజ్‌గౌడ్, బస్వం, కొంకళ్ల చెన్నయ్య, డంగు శ్రీను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment