మిల్లర్లకు నిర్దేశించిన సీఎంఆర్ అందజేయాలి
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
అనంతగిరి: రైస్ మిల్లర్లు నాణ్యమైన సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) అందజేయాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పౌరసరఫరాల కార్యాలయంలో ధాన్యం డెలివరీపై మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిల్లర్లకు నిర్దేశించిన లక్ష్యం మేరకు బియ్యం అందజేయాలన్నారు. జనవరి 25 వరకు 2,221 టన్నుల సన్నబియ్యంతో పాటు 2023–24 వానాకాలానికి సంబంధించిన 5,499.279 మెట్రిక్ టన్నుల బియ్యం సైతం అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్‌బాబు, జిల్లా మేనేజర్ విజయలక్ష్మి, ఏసీఎస్‌ఓ ఆర్తి నాయక్, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బాలేశ్వర్ గుప్తా, కార్యదర్శి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోగులకు ఇబ్బందులుతలెత్తకుండా చూడాలి
జిల్లా వైద్యాధికారి వెంకటరవణ
దోమ: ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యం అందించాల ని జిల్లా వైద్యాధికారి వెంకటరవణ సూచించారు. సోమవారం మండల పరిధిలోని బొంపల్లి ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్‌క్యూఏఎస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్) ఆధ్వర్యంలో జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలను ఏఓ ప్రవీణ్, నాణ్యత ప్రమాణా ల మేనేజర్ అనురాధ, డీటీహెచ్‌ఓ చండీశ్వ రితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి పరిసరాలు, మందులు తనిఖీ చేశారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే వైద్యులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్
అనంతగిరి: ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి వికారాబాద్ ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యూట్రీషియన్ కిట్ బంద్ అయిందన్నారు. నాలుగు నెలలుగా బ్లడ్ బ్యాంక్ రిఫ్రిజిరేటర్ పనిచేయడం లేదన్నారు. పరీక్ష ల నిమిత్తం బ్లడ్ శాంపిల్స్ తీసుకుని 12 రోజులైనా రిపోర్టులు అందడం లేదని రోగులు వాపోతున్నారన్నారు. అమ్మ ఒడి పథకం అమ లు కావడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి ఆస్పత్రుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, గోపాల్, రామస్వామి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడండి
మొయినాబాద్: కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి ని కాపాడాలని తోలుకట్ట గ్రామస్తులు రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. తోలుకట్ట రెవెన్యూలోని 108, 107, 85, 139, 138, 137, 143 సర్వేనంబర్లలో ఉన్న సుమారు126 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని తెలిపారు. ఇటీవల 108, 143 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జాచేశారని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశామని.. ఫిర్యాదు చేసిన గ్రామస్తులపై కబ్జాదారులు కేసులు పెట్టారని చెప్పారు. తమకు నోటీసులు ఇచ్చి ఇళ్లవద్దకు బౌన్సర్లను పంపి బెదిరింపులకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుని కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని కలెక్టర్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment