ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి
మోమిన్‌పేట: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మోమిన్‌పేటలో చోటుచేసుకుంది. కుటుంబీకులు, ఎస్‌ఐ అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గజ్జెల శివశంకర్‌గౌడ్(28) ఆదివారం సాయంత్రం తన పొలానికి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో సోమవారం ఉదయం తండ్రి సుదర్శన్ పొలానికి వెళ్లి చూశాడు. అక్కడ ఉన్న బావి వద్ద చెప్పులు ఉండటంతో అందులో జారి పడినట్లు ఆనవాళ్లు కన్పించాయి. ఈ మేరకు స్థానికులకు సమాచారమివ్వడంతో మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామా నిర్వహించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
భక్తులపై వ్యాపారుల దౌర్జన్యం
కొత్తూరు: ప్రఖ్యాతి గాంచిన జేపీదర్గా ఆవరణలో వ్యాపారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాజాగా సోమవారం దర్గా దర్శనం కోసం నగరం నుంచి వచ్చిన ఇద్దరు భక్తులపై కొందరు వ్యాపారులు తమ వద్ద పూలు కొనుగోలు చేయాలని దాడికి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించిన వివరాలు సీసీ పుటేజీల్లో నిక్షిప్తం అయ్యాయి. ఇరువురు భక్తులపై దర్గా ఆవరణలో పూల వ్యాపారం చేసే నలుగురు వ్యక్తులు తమ వద్ద పూలు కొనుగోలు చేయాలని దౌర్జన్యానికి పాల్పడ్డారని, కర్రలతో కొట్టినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment