సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
కుల్కచర్ల: సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు మేలు చేకూరుతుందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో బాధితులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులంతా ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, అంజిలయ్య, వెంకటయ్య, విఠల్ నాయక్, రఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొండాయపల్లిలో..
దోమ: సీఎం సహాయనిధి పేదలకు వరంలాంటిదని కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. సోమవారం మండల పరిధిలోని కొండాయపల్లి గ్రామానికి చెందిన బుడ్డ రామయ్య కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం సహాయనిధి కింద వైద్య ఖర్చుల నిమిత్తం రూ.44 వేలను ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మంజూరు చేయించారు. ఈ మేరకు నాయకులు బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి, మైపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఎల్.ఆంజనేయులు, వెంకటయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment