కొడంగల్@ రూ.437 కోట్లు
కొడంగల్: అభివృద్ధి పనులకు రూ.437 కోట్లు మంజూరైనట్లు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో కొడంగల్ అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని చెప్పారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పాలక మండలి చివరి సమావేశం నిర్వహించారు. ఇందులో గతంలో చేపట్టిన పనులు.. భవిష్యత్తులో చేయాల్సిన పనులపై సభ్యులతో చర్చించారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా విస్తరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు తదితర పనులకు రూ.337 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. పాత కొడంగల్ ట్యాంక్ బండ్ నిర్మాణానికి రూ.45 కోట్లు, మినీ స్టేడియం నిర్మాణానికి రూ.3 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.52 కోట్లకు అనుమతి వచ్చిందన్నారు. త్వరలో పనులు చేపట్టాల్సి ఉందన్నారు. మొత్తం రూ.437 కోట్లను కొడంగల్ మున్సిపల్‌కి కేటాయించినందుకు ప్రభుత్వానికి పాలకమండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగుల సహకారంతోనే..
ఉద్యోగుల సహకారంతోనే మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని అన్ని విభాగాల సిబ్బంది సహకారంతోనే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు చెప్పారు. శానిటేషన్, తాగునీరు, వీధి బల్బులు, సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్వహణ ఉద్యోగుల సహకారంతో సాధ్యమైందన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఉషారాణి, కమిషనర్ బలరాంనాయక్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మంజూరు చేసిన ప్రభుత్వం
పురపాలక సంఘం సమావేశంలో
వెల్లడించిన చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment