![కేంద్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/3/03022025-vkb_tab-01_subgroupimage_1875405792_mr-1738545861-0.jpg.webp?itok=1UJ421J8)
కేంద్ర మంత్రిని కలిసిన శంకర్ స్వామీజీ
బషీరాబాద్: తెలంగాణ సాధూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, దామర్‌చెడ్ భవానీమాత పీఠాధిపతి శ్రీ శంకర్ స్వామీజీ ఆదివారం న్యూఢిల్లీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌ను కలిశారు. దేశవ్యాప్తంగా శంకర్ స్వామీజీ చేపట్టిన ‘లక్ష గృహాలు.. లక్ష్మీ నిలయాలు’ అనే కార్యక్రమం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని కేంద్ర మంత్రి అన్నారు. సనాతనఽ ధర్మ ప్రచారంలో శంకర్ స్వామిజీ చేస్తున్న కృషిని అభినందించారు. దళిత మహిళలకు పాదపూజ వంటి కార్యక్రమాలు చేయడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
వానరానికి అంత్యక్రియలు
దుద్యాల్: వానరానికి అంత్యక్రియలు చేసిన ఘటన మండలంలోని హస్నాబాద్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నాయికోటి కుటుంబ సభ్యులు సాయప్ప, వెంకటప్ప, శేఖర్, ఆరుణ్‌లకు గ్రామ శివారులో పొలం ఉంది. ఉదయం వారు పొలానికి వెళ్లగా చెట్టు కింద వానరం కళేబరం కనిపించింది. దీంతో వారు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.
సీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా క్రాంతి
కొడంగల్: సీపీఎస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇల్లూరి క్రాంతికుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం వికారాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్(టీజీ సీపీఎస్) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. పాత పెన్షన్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న యూపీఎస్ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని కోరారు.
కరాటే పోటీల్లో సత్తాచాటిన విద్యార్థినులు
దుద్యాల్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే అండ్ కుంగ్‌ఫూ పోటీల్లో మండల విద్యార్థి నులు ప్రతిభ కనబరిచి బంగారు, వెండి పతకాలు సాధించారు. దుద్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అభినయ శ్రీ బంగారు పతకం సాధించగా.. సంధ్యారాణి, అక్షిత రజత పతకాలు సొంతం చేసుకున్నారు. మండలంలోని చెట్టుపల్లి తండా కేజీబీవీకి చెందిన శిరీష, నికిత బంగారు పతకాలు సాధించగా అనిత, శివాని, సోనాలి, ఆధ్య వెండి పతకాలు సొంతం చేసుకున్నారు. హస్నాబాద్ నేతాజీ ఉన్నత పాఠశాలకు చెందిన రిత్విక బంగారు పతకం సాధించింది.
మున్సిపల్ కార్మికుల
సమస్యలు పరిష్కరించాలి
చేవెళ్ల: మున్సిపల్ కార్మికులకు జీఓ నం. 60 ప్ర కారం వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలోని కార్మికులతో ఆదివా రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మి కులకు కనీస వేతనాలు అమలు చేయటంతోపాటు పర్మినెంట్ చేయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్, అమలు చేయాలని, బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. మున్సిపల్ కార్మికులకు యూ నిఫామ్స్ గుర్తింపు కార్డులు అందించాలని, విద్యార్హతలను బట్టి పదోన్నతులు కల్పించాలని కోరారు.
![కేంద్ర మంత్రిని కలిసిన శంకర్ స్వామీజీ
1](https://www.sakshi.com/gallery_images/2025/02/3/02kgdgl203-360033_mr-1738545861-1.jpg)
కేంద్ర మంత్రిని కలిసిన శంకర్ స్వామీజీ
![కేంద్ర మంత్రిని కలిసిన శంకర్ స్వామీజీ
2](https://www.sakshi.com/gallery_images/2025/02/3/02kgdgl02-360013_mr-1738545861-2.jpg)
కేంద్ర మంత్రిని కలిసిన శంకర్ స్వామీజీ
Comments
Please login to add a commentAdd a comment