![మార్క](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/0000634566-000001-sbhaskar_mr-1738718091-0.jpg.webp?itok=dZ1mzMwf)
మార్కెట్ ఫీజు వసూలుకు స్పెషల్ డ్రైవ్
నేటి నుంచి తనిఖీలు చేపట్టనున్న ప్రత్యేక బృందాలు
ధారూరు: మార్కెట్ ఫీజుకు ఎగనామం, రైతులకు శఠగోపం అనే శీర్షికన సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ధారూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ వ్యవసాయ మార్కెట్ల పరిధిలో ఆయా ఏఎంసీ కార్యదర్శులు, సూపర్‌వైజర్లు బుధవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. టీం లీడర్‌గా ధారూరు మార్కెట్ కార్యదర్శి సిద్దమ్మ నియమితులయ్యారు. మార్కెట్ ఫీజు వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇందు కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. మార్కెట్ ఫీజు ఎగ్గొట్టే వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేరుగా పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారులను గుర్తించి వారి నుంచి మార్కెట్ ఫీజు వసూలు చేయాలని, అలాగే తూకాల్లో మోసం, తరుగు తీత, కమీషన్ వసూలును అరికట్టాలని సూచించారు. ఒక్కో మార్కెట్ కమిటీ కార్యదర్శికి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్‌ను రక్షణగా ఉంటారు. ఆయా మార్కెట్ కమిటీల సూపర్‌వైజర్లు, కార్యదర్శులు స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొంటారు. జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ సారంగపాణి స్పెషల్ డ్రైవ్‌ను పర్యవేక్షిస్తారు. ధారూరు మండలం రాంపూర్ తండాలో మంగళవారం రెండు డీసీఎం వాహనాల్లో 165 క్వింటాళ్ల వేరుశనగను తరలిస్తుండగా ఏఎంసీ కార్యదర్శి సిద్దమ్మ పట్టుకున్నారు. రెండు డీసీఎంల నుంచి రూ.9,570 మార్కెట్ ఫీజుగా వసూలు చేసి మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి ఎక్కడ వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసినా మార్కెట్ ఫీజు చెలిలచాలని ఆదేశించారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
అడిషనల్ కలెక్టర్ సుధీర్ కుమార్
కొడంగల్: వేసవి కాలం సమీపిస్తున్నందున అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుధీర్ కుమార్ సూచించారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవిలో ప్రజలకు తగినంత తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు గ్రామాలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉష శ్రీ, పీఆర్ డీఈఈ సుదర్శన్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శ్రీకాంత్, ఎమ్‌ఈఓ రాంరెడ్డి, సీడీపీఓ రజిత, ఎమ్‌పీఓ జైపాల్‌రెడ్డి, ఏపీఓ రాములు, ఏపీఎమ్ వెంకన్న, వార్డెన్లు హన్మంత్‌రెడ్డి, వరలక్ష్మీ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
![మార్కెట్ ఫీజు వసూలుకు స్పెషల్ డ్రైవ్
1](https://www.sakshi.com/gallery_images/2025/02/5/05022025-vkb_tab-01_subgroupimage_1885660256_mr-1738718091-1.jpg)
మార్కెట్ ఫీజు వసూలుకు స్పెషల్ డ్రైవ్
Comments
Please login to add a commentAdd a comment