మధురవాడ: మధురవాడ సుద్దగెడ్డ వద్ద టిడ్కో ఇళ్ల సముదాయంలో మహిళా క్రీడాకారులకు కల్పించిన సౌకర్యాలను గురువారం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఆర్డీవో భాస్కరరెడ్డి, జీవీఎంసీ ఏడీసీ వై.శ్రీనివాస్, డీసీఆర్ ఎస్.శ్రీనివాస్ పరిశీలించారు. ఇక్కడ 26 జిల్లాల మహిళా జట్లకు వసతి కల్పిస్తున్నారు. ఇందుకోసం 243 గదులు కేటాయించారు. భోజనం, తాగునీరు, వసతి, రక్షణ కోసం 100 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. వైద్యులు, పారిశుధ్య సిబ్బంది, ప్లంబర్, విద్యుత్ తదితర సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారు. భీమిలి జెడ్సీ శైలజా వల్లి ఇక్కడ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment