వ్యక్తిగత ఫొటోలతో వివాహితకు వేధింపులు | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత ఫొటోలతో వివాహితకు వేధింపులు

Published Sat, Oct 12 2024 1:16 PM | Last Updated on Sat, Oct 12 2024 1:16 PM

-

విశాఖ సిటీ: వివాహిత వ్యక్తిగత ఫొటోలు ఆమె కుటుంబ సభ్యులకు పంపించి వేధిస్తున్న 22 ఏళ్ల రాళ్లబండి రాజేష్‌ను సైబర్‌ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివరాలివీ.. నగరానికి చెందిన వివాహి తకు గుర్తు తెలియని ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి రిక్వెస్ట్‌ వచ్చింది. ఆమె దానిని అంగీకరించడంతో వారి మధ్య చాటింగ్‌ ప్రారంభమైంది. మంచిగా మాట్లాడుతూ ఒకసారి ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడు. కొద్ది రోజుల కు పరిచయం బాగా పెరడంతో వీడి యో కాల్‌ మాట్లాడుతూ దుస్తులు తీయాలని చెప్పాడు. ఆ సమయంలో స్క్రీన్‌ షాట్‌ తీసుకుని తర్వాత డబ్బులు కోసం బెదిరించాడు. అయి తే ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ ఫొటోలను ఫేక్‌ వాట్సాప్‌ అకౌంట్‌ ద్వారా ఆమె కుటుంబ సభ్యులకు పంపించాడు. దీంతో బాధితురాలు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సాంకేతికత సహాయంతో విజయనగరానికి చెందిన రాజేష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement