దసరా.. సందడేదీ? | - | Sakshi
Sakshi News home page

దసరా.. సందడేదీ?

Published Sat, Oct 12 2024 1:16 PM | Last Updated on Sat, Oct 12 2024 1:16 PM

దసరా.

విశాఖపట్నం
● మార్కెట్లో కనిపించని కళ ● ప్రజల్లో క్షీణించిన కొనుగోలు శక్తి ● ప్రభుత్వం నుంచి అందని పథకాలు ● బేల చూపులు చూస్తున్న ప్రజలు ● గతేడాది రూ.100 కోట్లు దాటిన వ్యాపారాలు ● ఈఏడాది రూ.50 కోట్లు దాటితే పండగే
జీతమూ లేదు..బోనస్సూ లేదు

5

శనివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

రూ.10 కోట్లైనా దాటలేదు..!

సరా రోజున కొత్త వస్తువుల కొనుగోళ్లలో మొబైల్‌ రంగం ఆగ్రస్థానంలో నిలుస్తోంది. గత నాలుగైదేళ్లుగా దసరా సమయంంలో మొబైళ్ల విక్రయాలు ఎక్కువగా జరిగినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. రెండో స్థానంలో ఎలక్ట్రానిక్‌ పరికరాలదే. మధ్య తరగతి, దిగువ తరగతి ప్రజలు దసరా సందర్భంగా ఇంట్లో వినియోగించే గృహోపకరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ప్రధానంగా టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, ఏసీలతోపాటు అనేక ఎలక్ట్రానిక్‌ పరికరాల కొనుగోళ్లతో నాలుగేళ్ల పాటు కళకళలాడేవి. గత దసరా సీజన్‌లో ఈ రెండింటి మార్కెట్‌ రూ. 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు జరిగిందని..ఈసారి ఇప్పటి వరకూ రూ.10 కోట్లయినా దాటలేదని వ్యాపారులు వాపోతున్నారు. అదేవిధంగా పండగ వచ్చిందంటే ముందుగా కొత్త వస్త్రాలు కొనుగోళ్లే అధికంగా ఉంటాయి. వస్త్ర వ్యాపారులు కూడా మహిళలను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లు ప్రకటించారు. ఏటా ఆఫర్ల హంగామాతో కళకళలాడుతుండే వస్త్ర ప్రపంచాలు ఈసారి బోసిపోతున్నాయి. ప్రతి ఏటా రూ.50 కోట్ల వరకూ వ్యాపారాలు జరిగేవి. ఈసారి మాత్రం రూ.25 కోట్లు మించినా చాలని అంటున్నారు. కానీ.. ఆ మేర కొనుగోళ్లు జరగకపోవడంతో వ్యాపార వర్గాల్లోనూ దసరా పండగ కనిపించడం లేదు. మొత్తంగా దసరా వ్యాపారం జిల్లాలో రూ.100 కోట్ల వరకూ జరుగుతుంటుంది. ఈసారి రూ.50 కోట్లు జరిగినా.. మాకు పండగ వచ్చినట్లే అని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఇలా.. కూటమి ప్రభుత్వ అబద్ధాల వైఖరి వల్ల.. అన్ని వర్గాల్లోనూ దసరా సరదా లేకుండానే పోయింది.

పోర్టును సందర్శించిన

ఆస్ట్రేలియన్‌ బృందం

సాక్షి, విశాఖపట్నం : సంక్రాంతి తర్వాత.. ఉత్తరాంధ్ర ప్రజలు పండగ చేసుకునేది దసరా రోజునే. పిండివంటలు.. కొత్త బట్టలు.. ఘుమఘుమలాడించే నాన్‌వెజ్‌ వంటకాలతో ఊరు వాడా సందడి వాతావరణం కనిపిస్తుంది. వారం రోజులు ముందుగానే మార్కెట్లు కళకళలాడుతుంటాయి. కానీ.. ఈ సారి ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. మార్కెట్‌లో సందడి లేదు.. జనంలో ఉత్సాహం లేదు. ప్రభుత్వం నుంచి పథకాల లబ్ధి రాక.. ప్రజల్లో కొనుగోలు శక్తి సన్నగిల్లిపోవడంతో దసరా మార్కెట్‌ బోసిపోయింది.

దసరా పండగను ప్రతి ఒక్కరూ వైభవంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇంటికి కొత్త వస్తువును తీసుకొని రావడం సంప్రదాయంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో వ్యాపారాలు.. మూడు ఆఫర్లు.. ఆరు కొనుగోళ్లులా కళకళలాడుతుంటాయి. ప్రధానంగా టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్లు, ఏసీలతో పాటు మొబైల్స్‌ కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే వాహనాల కొనుగోళ్లు కూడా నాలుగైదు రోజులుగా జోరందుకునేవి. ఈ దసరాకు మాత్రం అంతా నిశ్శబ్దంగా మారింది. ఆఫర్లు ఉన్న.. కొనుగోళ్లు కనిపించడం లేదు. కొత్త స్టాక్‌ వచ్చినా.. ఏ మాత్రం సేల్‌ అవ్వడం లేదు. ఎందుకంటే.. ప్రజలు ఈ దసరాని ఉత్సాహంగా జరుపుకునేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. జనం దగ్గర డబ్బులు లేకపోవడమే ప్రధాన కారణం. గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం నుంచి వివిథ పథకాల ద్వారా నగదు లబ్ధి ప్రజలకు చేరుతుండేది. ఆ నగదు తమ ఆర్థిక అవసరాలకు వినియోగించుకునేవారు. ఉదాహరణకు దసరా సమయంలో వైఎస్సార్‌ చేయూత పేరుతో రూ.18,750 కొన్ని సందర్భాల్లోనూ వైఎస్సార్‌ రైతు భరోసా, జగనన్న చేదోడు, వాహనమిత్ర.. ఇలా విభిన్నమైన పథకాల ద్వారా ఏదో ఒక రూపంలో నగదు బదిలీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేది. ఈ డబ్బులు మార్కెట్‌లో రొటేటింగ్‌ జరిగేది. ఫలితంగా.. మార్కెట్లు కళకళలాడుతుండేవి. తద్వారా కొనుగోళ్ల ద్వారా వ్యాపార సంస్థల నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు నగదు చేరేది. మళ్లీ ఆ నగదు.. ప్రజల ఖాతాల్లోకి మరో పథకం రూపంలో అందజేసేవారు. ఇలా నగదు చలామణి జరిగేది. దీనివల్ల అటు ప్రజలు.. ఇటు వ్యాపారులు పండగ చేసుకునేవారు. ఈ దసరా మాత్రం అందరికీ చేదు అనుభవాన్ని అందిస్తోంది.

విశాఖ సిటీ: ఆస్ట్రేలియా డిప్యూటీ కాన్సులేట్‌ జనరల్‌ డేవిడ్‌ ఎగుల్స్‌టన్‌, ఆస్ట్రేలియా హై కమిషన్‌ ఫస్ట్‌ సెక్రటరీ గ్రేస్‌ విలియమ్స్‌ విశాఖ పోర్టును శుక్రవారం సందర్శించారు. పోర్ట్‌ డిప్యూటీ చైర్మన్‌ దుర్గేశ్‌ కుమార్‌ దూబే వారికి సాదర స్వాగతం పలికారు. పోర్టులో ఉన్న సౌకర్యాలు, అభివృద్ధికి చేపడుతున్న వ్యూహాత్మక కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. భవిష్యత్తులో ఆస్ట్రేలియాతో వ్యాపార సంబంధాలకు అవసరమైన సహకారాన్ని అందజేస్తామని తెలిపారు. ఆస్ట్రేలియా నుంచి కుకింగ్‌ కోల్‌ను దిగుమతి చేసుకుంటున్నామని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కోసం ఆ బొగ్గును వినియోగిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా డిప్యూటీ కాన్సులేట్‌ జనరల్‌ డేవిడ్‌ ఎగుల్స్‌టన్‌ మాట్లాడుతూ భారత్‌ కు కావాల్సిన కోల్‌ అవసరాలను తెర్చే అవకాశం కలిగినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. పోర్టులో క్రూయిజ్‌ టెర్మినల్‌కు భారీ అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. వ్యాపార సౌలభ్యం, టర్న్‌ రౌండ్‌ టైమ్‌, కస్టమ్స్‌ క్లియరెన్స్‌, పోర్ట్‌ కనెక్టివిటీ, ట్రాన్‌షిప్‌మెంట్‌, క్రూయిజ్‌ ప్రయాణీకులు, ట్రాఫిక్‌, డ్రెడ్జింగ్‌ తదితర అంశాలపై చర్చించారు.

న్యూస్‌రీల్‌

స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులకు షాక్‌ దసరా పండగ వేళ ఆందోళన కూటమి నేతల హామీలపై ఆగ్రహం

సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌ కార్మికులకు దసరా సందడి లేకుండా పోయింది. పది నెలలుగా 10వ తేదీలోగా ఇచ్చే సగం జీతం ఇవ్వకపోగా ఎప్పుడూ లేని విధంగా దసరా ముందు చెల్లించే బోనస్‌ ఎగ్గొట్టారు. ఈ విషయంపై కార్మిక సంఘాల నాయకులు చేతకాని వారిగా మిగలగా స్టీల్‌ప్లాంట్‌ కోసం ప్రగల్భాలు పలుకుతున్న ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల స్టీల్‌ప్లాంట్‌ అంశంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఉక్కు మంత్రి కుమారస్వామిలతో చర్చించామని.. ప్లాంట్‌కు సంబంధించి ప్యాకేజిని అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడి యా మీట్‌లో చెప్పగా, విశాఖ ఎంపీ భరత్‌, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తాము స్టీల్‌ప్లాంట్‌ విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని ప్రకటనలు చేశారు. వీరు చెప్పిన మాటలు బుట్టదాఖలు కావడంతో కార్మిక వర్గాలు ఆందోళన చెందతున్నాయి. ఈ ఏడాది సెయిల్‌లో రూ. 26,500 బోనస్‌ చెల్లించగా.. స్టీల్‌ప్లాంట్‌ కార్మికులకు మొ త్తం బోనస్‌ ఎగ్గొట్టారు. ప్రతినెలా పదోతేదీలోగా ఇచ్చే సగం జీతం కూడా 15వ తేదీ తరువాత ఇస్తామని ప్రకటించడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సగం జీతం కోసం రూ. 40 కోట్లు లేని పరిస్థితిలో యాజమాన్యం ఉందంటే ఉద్యోగులు నమ్మడం లేదు. కావాలనే ఈ పరిస్థితిని సృష్టించారని ఉద్యోగులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అమరావతి, పోలవరం నిర్మాణాలకు అవసరమైన ఐరన్‌ కోసం కనీసం రూ. 100 కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చినా ఉద్యోగుల పూర్తి జీతం చెల్లించవచ్చు. అయితే మాటలే తప్ప చేతలు లేని కూటమి నాయకులు స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం నుంచి పైసా రాక..

సూపర్‌ సిక్స్‌ అంటూ ఊదరగొడుతూ.. అలవి కాని హామీలతో అందలమెక్కిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల గురించి పట్టించుకోవడం మానేసింది. గద్దెనెక్కి 120 రోజులు గడిచినా.. ఇంతవరకూ ప్రజలకు ఒక్క పథకాన్ని కూడా అందించలేదు. ఫలితంగా.. ప్రజల బ్యాంకు ఖాతాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో దసరాకు ఏదో ఒక విధంగా.. షాపింగ్‌ చేసుకునే ప్రజలు ఇప్పుడు నిరాశగా ఉన్నారు. పండగ పూట పస్తులుండేలా ప్రభుత్వం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈసారి పండగని ఎలాగోలా కానిచ్చేద్దామంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
దసరా.. సందడేదీ?1
1/3

దసరా.. సందడేదీ?

దసరా.. సందడేదీ?2
2/3

దసరా.. సందడేదీ?

దసరా.. సందడేదీ?3
3/3

దసరా.. సందడేదీ?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement