క్లాక్ టవర్... ‘హోల్’ ఫియర్
జగదాంబ కూడలి..క్లాక్ టవర్ వద్ద రోడ్డుకు పెద్ద రంధ్రం ఏర్పడింది. రోడ్డు దిగువున భూగర్భ డ్రైనేజీ ఉండడంతో రోడ్డుకు కూరుకు పోయింది. ఏమాత్రం ఆదమరిచినా గోతిలో పడిపోవడం ఖాయం. రాత్రి సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కనీసం అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా వాహనచోదకులు గమనిస్తారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే జగదాంబ కూడలి మీదుగానే చాలా మంది అధికారులు కలెక్టరేట్‌కు వెళతారు..కనీసం వారు కూడా స్పందించకపోవడం దారుణం.
–ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment