ట్యాంకర్‌ ఢీకొని వైద్య విద్యార్థిని దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ట్యాంకర్‌ ఢీకొని వైద్య విద్యార్థిని దుర్మరణం

Published Sat, Oct 12 2024 1:16 PM | Last Updated on Sat, Oct 12 2024 1:16 PM

ట్యాంకర్‌ ఢీకొని వైద్య విద్యార్థిని దుర్మరణం

ట్యాంకర్‌ ఢీకొని వైద్య విద్యార్థిని దుర్మరణం

ఆరిలోవ: జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఎంబీబీఎస్‌ చదువుతున్న ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆరిలోవ ట్రాఫి క్‌ పోలీసులు తెలిపిన వివరాలివీ..ఎండాడకు చెందిన కాంచన, ఆమె కుమార్తె నిషిత(20) శుక్రవారం మధ్యాహ్నం స్కూటీపై నగరానికి వెళుతున్నారు. జాతీయ రహదారిపై జూ పార్కు సమీపంలో వెనుకనే వస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చొన్న నిషిత రోడ్డుపై పడగా.. ట్యాంకర్‌ టైర్‌ నిషిత తలపైకి ఎక్కేసింది. తల నుజ్జునుజ్జయి సంఘటన స్థలంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. స్కూటీ నడుపుతున్న కాంచన ముఖానికి గాయాలయ్యాయి. నిషిత ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో రెండో సంవత్సరం ఎంబీబీఎస్‌ చదువుతోంది. మరో రెండేళ్లలో డాక్టర్‌ కావాల్సిన నిషిత కళ్లేదుటే మృతి చెందడంతో ఆమె తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌, ఎస్‌ఐ శ్రీకాంత్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. నిషిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. ఆరిలోవ లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement