డిసెంబర్‌ 14న మెగా లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 14న మెగా లోక్‌ అదాలత్‌

Published Wed, Nov 6 2024 1:33 AM | Last Updated on Wed, Nov 6 2024 1:33 AM

డిసెంబర్‌ 14న మెగా లోక్‌ అదాలత్‌

డిసెంబర్‌ 14న మెగా లోక్‌ అదాలత్‌

విశాఖ లీగల్‌ : వచ్చే నెల 14వ తేదీన మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్‌ వెల్లడించారు. మంగళవారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో న్యాయమూర్తులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, వివిధ కంపెనీల న్యాయ సలహాదారులు, బీమా, బ్యాంకులు, పోలీస్‌ అధికారులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న సివిల్‌, క్రిమినల్‌ కేసులను రాజీ చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి నెల రోజులపాటు అవగాహన శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కల్పించే న్యాయమూర్తులకు తమ సహాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రధాన మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఎం.వెంకటరమణ, ప్రధాన కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి రాధారత్నం, లోక్‌ అదాలత్‌ కార్యదర్శి ఎం.వి.శేషమ్మ, సీనియర్‌ జూనియర్‌ న్యాయమూర్తులు, పలు జిల్లాల న్యాయమూర్తులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement