భక్తిశ్రద్ధలతో నాగుల చవితి
నగర ప్రజలు భక్తిశ్రద్ధలతో నాగుల చవితి నిర్వహించారు. ముడసర్లోవ, కంబాలకొండ పార్కు, జూ పార్కు, జోడుగుళ్లపాలెం, విశాఖ వేలీ స్కూల్ రోడ్డు, కై లాసగిరి, ఏయూ క్యాంపస్, పోర్టు స్టేడియం, పోర్టు క్వార్టర్స్ ప్రాంతాలు, తగరపువలస, గాజువాక, పెందుర్తి తదితర ప్రాంతాల్లోని పుట్టల వద్ద మంగళ వారం విశేషంగా పూజలు చేశారు. ముందుగా పుట్టల వద్ద ముగ్గులతో అలంకరించారు. తర్వాత పాలు, కోడి గుడ్లు, నువ్వుండలు వేసి పూజించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఈ ప్రాంతాలు సందడిగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment