జూకు పోటెత్తారు
కంబాలకొండ కళకళ
ఆరిలోవ: నాగులచవితి సందర్భంగా జూ పార్కుకు మంగళవారం రూ.లక్షల్లో ఆదాయం సమకూరింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన ద్వారం, సాగర్ ద్వారం నుంచి 9,914 మంది జూను సందర్శించినట్లు ఇన్‌చార్జి క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. వారి ద్వారా రూ.7,58,279 ఆదాయం లభించిందని ఆమె వెల్లడించారు. జూ లోపలకు ఎలాంటి బాణసంచా తీసుకెళ్లకుండా సిబ్బంది తనిఖీలు చేపట్టారన్నారు. కార్తీకమాసంలో సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ఆరిలోవ: కంబాలకొండ ఎకో టూరిజం పార్కు మంగళవారం నాగులచవితి భక్తులతో కళకళలాడింది. 3 వేల మందికి పైగా పార్కును సందర్శించగా.. వారి ద్వారా రూ.2.14 లక్షల ఆదాయం వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ పుట్టల వద్ద భక్తులు నాగులచవితి వేడుకలు నిర్వహించి.. అనంతరం కుటుంబాలతో కలిసి పిక్నిక్‌లు జరుపుకున్నారు. రోజంతా ఇక్కడే గడిపి.. చెట్ల కింద సహపంక్తి భోజనాలు చేశారు. పిల్లలు సరదాగా ఆటలు ఆడారు.
Comments
Please login to add a commentAdd a comment