జిల్లాలో కూటమి నేతల కనుసన్నల్లో రేషన్ బియ్యం మాఫియా నడుస్తోంది. గత వైఎస్సార్ సీపీ హయాంలో రేషన్ బియ్యం సక్రమంగా లబ్ధిదారులకు అందేవి. కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేల అండదండలతో ఆ పార్టీలకు చెందిన చోటా నేతలు బియ్యం దందా నడుపుతున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని ఆ పరిధిలోని నాయకుడు చెప్పుచేతుల్లోకి తీసుకొని.. బియ్యాన్ని అక్రమంగా తరలించేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా రేషన్ బియ్యం సేకరించేందుకు ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసుకుని దందా కొనసాగిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 37,800 టన్నుల వరకూ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారంటే అసలు దందా ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment