వాహనం వద్దకు వచ్చిన లబ్ధిదారులకు బియ్యం ఇవ్వం. డబ్బులిస్తాం తీసుకెళ్లండి అంటూ దందా చేస్తున్నారు. మాకు డబ్బులొద్దు.. బియ్యం కావాలని అడిగితే కిలోకి అదనంగా రూపాయి చొప్పున చెల్లిస్తున్నారే తప్ప.. బియ్యం ఇచ్చేందుకు చాలామంది ఎండీయూ వాహదారులు ఇష్టపడటం లేదు. లబ్ధిదారుల దగ్గర బియ్యాన్ని కిలో రూ.12కి కొంటున్నారు. ఎండీయూ వాహనాల నుంచి ‘రేషన్ మాఫియా’ ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు విక్రయిస్తున్నారు. మిల్లర్లు రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టించి కిలో రూ.30 నుంచి రూ.40లకు వ్యాపారులకు అమ్ముతున్నారు. పాలిష్ చేసిన ఈ బియ్యాన్ని తిరిగి ఆ పేదలే సన్నబియ్యంగా భ్రమపడి.. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.45 నుంచి రూ.55 ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment