కూటమి చేతుల్లో
రేషన్ బియ్యాన్ని బొక్కేస్తున్న కూటమి నేతలు
మిల్లర్ల సహకారంతో టన్నుల కొద్దీ అక్రమ నిల్వలు
● ఎండీయూ వాహనదారులకు ఎర వేసి బియ్యాన్ని దోచేస్తున్న వ్యాపారులు ● కూటమి నేతల్ని కాపాడేందుకు చిరు వ్యాపారులపై దాడులు ● రెండు నెలల్లో 37,800 కిలోల రేషన్ బియ్యం పట్టివేత
● ఈ నెల 16న ఆనందపురం మండలం పెద్దిపాలెంలోని రైస్ మిల్లులో పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేసి 3 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు.
● ఈనెల 10వ తేదీ నరవలో నిల్వ ఉంచిన 1800 కిలోల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.
● ఈ నెల 8న అగనంపూడిలో అక్రమంగా తరలిస్తున్న 4,300 కిలోల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.
● గత నెల 16న చినముషిడివాడలో అక్రమంగా నిల్వ ఉంచిన 630 కిలోల పీడీఎస్ బియ్యాన్ని జిల్లా పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు.
ఇవి కేవలం చిన్న తిమింగళాలే.. కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతున్న రేషన్ మాఫియాని కట్టడి చేసేందుకు మాత్రం పౌర సరఫరాల శాఖ అధికారులు భయపడుతున్నారు. కొందరు అధికారులైతే చోటా నేతలు, డీలర్లతో కుమ్మకై ్క జేబులు నింపేసుకుంటున్నారు. టన్నుల కొద్దీ అక్రమ నిల్వలున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment