● అర్ధరాత్రి జాబితాలు.. వాట్సాప్ సందేశాలు
● నేడు డీఈవో కార్యాలయంలో కౌన్సిలింగ్
విశాఖ విద్య: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖలో పదోన్నతుల ప్రక్రియ గందరగోళానికి దారితీస్తోంది. రాత్రి వేళ సీనియార్టీ జాబితాలను ప్రకటించి, తెల్లవారి ప్రమోషన్ల కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని వాట్సాప్‌లో సమాచారం పంపిస్తున్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలోని మున్సిపల్ స్కూళ్లలో పనిచేస్తున్న 12 మంది ఉపాధ్యాయులకు ఇటీవల పదోన్నతులు కల్పించారు. 70:30 నిష్పత్తి పాటించకపోవడంపై వ్యతిరేకత వెల్లువెత్తడంతో మళ్లీ ఖాళీల గుర్తింపు చేపట్టారు. తాజాగా స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో 34 ఖాళీలను ప్రకటించారు. ఎస్‌ఏ తెలుగు–13, హిందీ–3, గణితం–3, ఇంగ్లిష్–4 ఫిజిక్స్–1, బయాలజీ–6, సోషల్–4 ఉన్నట్లు లెక్క తేల్చారు. శనివారం ఉదయం 10.30కు డీఈవో కార్యాలయంలో జరిగే కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని డీఈవో ప్రేమ్‌కుమార్ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. సీనియార్టీ జాబితాలపై అభ్యంతరాలకు గడువీయకుండానే కౌన్సెలింగ్‌కు పిలవడమేంటని ఉపాధ్యాయులు ఆక్షేపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment