24 నుంచి మళ్లీ వర్ష సూచన
వానలకు తాత్కాలిక విరామం
సాక్షి, విశాఖపట్నం: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరుణుడు తాత్కాలిక విరామం ప్రకటించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం విశాఖ జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. గడిచిన మూడు రోజుల్లో పలుచోట్ల దాదాపు 100 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ముసురు వాతావరణం నెలకొనడంతో.. చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు రోజులుగా వర్షాల కారణంగా పాఠశాలలు, కాలేజీలకు వెళ్లేందుకు ఇక్కట్లు పడిన విద్యార్థులకు.. జిల్లా కలెక్టర్ శనివారం సెలవు ప్రకటించడంతో కాస్తా ఉపశమనం పొందారు. పాదచారులు, వాహనదారులు అవస్థలు పడ్డారు. శనివారం మధ్యాహ్నం వరకూ చిరు జల్లులుగా కురిసింది. సాయంత్రం నుంచి వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో.. విశాఖ వాసులు కాస్తా ఉపశమనం పొందారు. ఇదిలావుండగా ఈ నెల 24,25 తేదీల్లో జిల్లాలో మళ్లీ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment