సేవా సంబరం
జనాభిమానం..
పండగలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు
జన హృదయనేత..మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడువైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం జిల్లా అంతటా వేడుకగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానుల ఆధ్వర్యంలో రక్తదానాలు, అన్నదానాలు, చీరలు పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు బర్త్‌డే కేక్‌లు కట్ చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చల్లగా ఉండాలని మనసారా ఆశీర్వదించారు.
పాల్గొన్న మాజీ మంత్రి అమర్‌నాథ్, పార్టీ నేతలు
భీమిలి మండలం చిననాగమయ్యపాలెంలో 40 అడుగులజగన్ ఫ్లెక్సీ
రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావుకు కేక్ తినిపిస్తున్న మేయర్ గొలగాని హరి వెంకట కుమారి. చిత్రంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి,పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, సమన్వయకర్త కె.కె రాజు.
● గాజువాక నియోజవర్గంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యంలో 66, 67, 72, 68, 70, 72,74, 86, 87వ వార్డుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
● విశాఖ దక్షిణలో 29, 31, 33, 34, 35, 37, 41వ వార్డుల్లో ఆయా కార్పొరేటర్లు, వార్డు ఇన్‌చార్జిల అధ్యర్యలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గణేష్‌కుమార్ పాల్గొన్నారు.
● విశాఖ ఉత్తరలో 14, 44, 46,47, 49వ వార్డుల్లో నిర్వహించిన వేడుకల్లో సమన్వయకర్త కె.కె రాజు పాల్గొన్నారు. వృద్ధులకు పండ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
● భీమిలి నియోజకవర్గంలో అర్బన్, రూరల్ పరిధిలో జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేశారు.
● విశాఖ తూర్పులో 28వ వార్డులో పల్లా దుర్గారావు ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పాల్గొన్నారు.
● పెందుర్తి నియోజవర్గంలో మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో పెందుర్తి మండలం రాంపురంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.
● విశాఖ పశ్చిమలో 40,56,52,57,59, 60,62,63,89,90 వార్డుల్లో వేడుకలు నిర్వహించారు.
సాక్షి, విశాఖపట్నం:
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలంతా ఓ పండగలా నిర్వహించుకున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ కొనియాడారు. కోట్లాది మంది అభిమానులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు జగనన్నను ఆశీర్వదించారన్నారన్నారు. శనివారం మద్దిలపాలెం పార్టీ జిల్లా కార్యాలయంలో గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత మారుతి ప్రసాద్ నిర్వహణలో గుడివాడ అమర్‌నాథ్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఉత్తర సమన్వయకర్త కె.కె రాజు, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ సీనియర్ నేత మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పూర్ణానంద శర్మ, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. జిల్లా ఎస్సీ విభాగం నాయకులు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో అమర్‌నాథ్, గొల్ల బాబూరావులు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన కోట్లాది ప్రజలంతా మళ్లీ సీఎంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారన్నారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ..వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని, ఈ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా సంక్షేమ పాలన అందించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్ర మాట్లాడుతూ..గత ఐదేళ్లలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేసి సంక్షేమ పాలన తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేన న్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, తైనాల విజయకుమార్, తిప్పలనాగిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, డిప్యూటీ మేయర్ కె. సతీష్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్‌వెస్లీ, పేర్ల విజయ్‌చందర్, మహంతి, పార్టీ ముఖ్యనాయకులు రొంగలి జగన్నాథం, చొక్కాకుల వెంకంట్రావ్, తిప్పల దేవాన్‌రెడ్డి, జహీర్ అహ్మద్, కొండా రాజీవ్‌గాంధీ, ద్రోణంరాజు శ్రీవాత్సవ్, పేడాడ రమణకుమారి, మాధవీవర్మ, ఐహెచ్ ఫరూకీ, కాళిదాస్‌రెడ్డి, కృష్ణంరాజు, అడ్డాల కృపాజ్యోతి, రామన్నపాత్రుడు, బాజీనాయుడు, వానపల్లి ఈశ్వరరావు, బొండా ఉమామహేశ్వరరావు, పెండ్ర అప్పన్న, తుల్లి చంద్రశేఖర్, రోజారాణి, రాజేశ్వరి,రాధ, జగదీష్, కొల్లి సింహాచలం, కార్పొరేటర్లు కె.సునీత, అనిల్ కుమార్‌రాజు, మువ్వల లక్ష్మి, సురేష్, పద్మారెడ్డి, బిపిన్‌కుమార్ జైన్, మసిగపోగురాజు, కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్, అల్లు శంకర్‌రావు, రెయ్యి వెంకటరమణ, బర్కత్ అలీ, శశికళ, మహమ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment